పోస్టులు షేర్ చేసిన వ్యక్తి అరెస్టు

by srinivas |
పోస్టులు షేర్ చేసిన వ్యక్తి అరెస్టు
X

దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియాలో ప్రభుత్వం వ్యతిరేక పోస్టులు పెట్టాడని వైజాగ్ లో టీడీపీ సానుభూతిపరుడిని సీఐడీ అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. మంత్రి అవంతి శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు ఈరోజు తెల్లవారుజామున నలంద కిషోర్ అనే వ్యక్తిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలంద కిషోర్‌కు మూడు రోజుల క్రితం సీఐడీ అధికారులు నోటీస్‌ ఇచ్చారు. కాగా నలంద కిషోర్ టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కి సన్నిహితుడు. అరెస్ట్‌ అనంతరం రీజనల్‌ సీఐడీ కార్యాలయానికి ఆయనను తరలించారు.

Advertisement

Next Story