నాకు సంబంధం లేదు : సీఐ

by srinivas |
నాకు సంబంధం లేదు : సీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్‌లో గంజాయి స్మగ్లింగ్‌ కేసులో హిందూపురం టూటౌన్‌ సీఐ శ్రీరామ్‌ ఆబ్కారీ పోలీస్‌శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆబ్కారీ శాఖ సీఐ శ్రీరామ్‌ పాత్రపై విచారణ జరుపుతోంది. తాజాగా దీనిపై సీఐ శ్రీరామ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పల్‌లో దొరికిన గంజాయి స్మగ్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మోహన్ కృష్ణ అనే వ్యక్తి తన దగ్గర ఎప్పుడూ పనిచేయలేదని అన్నారు. అంతేగాకుండా గంజాయి స్మగ్లింగ్‌కు ఉపయోగించిన వాహనం కూడా తనది కాదని స్పష్టం చేశారు. విచారణలో కూడా మోహన్ కృష్ణ ఎక్కడా తన పేరు చెప్పలేదని, అయినా తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సీఐ శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో తెలియాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విచారణలో తన తప్పు ఉన్నట్టు తేలితే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధం అని అన్నారు. ఉద్యోగానికి సైతం రాజీనామా చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story