- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నమస్తే మేడమ్'.. కన్న కూతురికి తండ్రి సెల్యూట్!
దిశ,వెబ్‌డెస్క్: వాళ్లిద్దరూ పోలీసులు. కుమార్తె ఐపీఎస్. తండ్రి సీఐ. ఇద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఏకంగా కూతురికి ‘నమస్తే మేడమ్’ అంటూ సెల్యూట్ చేసే అవకాశం ఆ తండ్రికి లభిస్తే అంతకన్నా గర్వకారణం ఏముంటుంది. అలాంటి అరుదైన సంఘటనకు వేదికైంది ‘పోలీస్ డ్యూటీ మీట్ 2021’. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వీరు తండ్రీ కూతుళ్లు. ఇతను తిరుపతి కళ్యాణి డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సీఐ శ్యామ్ సుందర్. ఈమె గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి.
వీళ్లిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపి పోలీస్‌శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి హాజరయ్యారు. ఈ పోలీస్ డ్యూటీ మీట్ లో తనకంటే ఉన్నత స్థాయికి ఎదిగిన కూతురికి సెల్యూట్ చేసి ఉప్పొంగిపోయారు సీఐ శ్యామ్ సుందర్.
తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో తండ్రి శ్యామ్ సుందర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. 2018 బ్యాచ్ కి చెందిన జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో ‘దిశ’ విభాగంలో భాద్యతలు నిర్వహిస్తున్నారు జెస్సీ ప్రశాంతి.
ఈ సందర్భంగా కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో విధులు నిర్వహిస్తుండగా.. దూరం నుంచి చూస్తూ తండ్రి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేయడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ఇది గమనించిన జెస్సీ ప్రశాంతి వెంటనే సెల్యూట్ చేసి ‘ఏంటి నాన్నా?’ అంటూ సిగ్గుపడ్డారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ… తిరుపతి డ్యూటీ మీట్‌లో తండ్రీకూతుళ్లు ఇలా యూనిఫాం ధరించి విధుల్లో పాల్గొనడం వ్యక్తిగతంగా గర్వంగా ఉందన్నారు. ఆడపిల్లల్ని కన్న ప్రతి తల్లిదండ్రులకు పాదాభివందనం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.