- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చర్చి ఫాదర్ రాసలీలలు.. సిగ్గులేకుండా ఏకంగా చర్చిలోనే యువతితో..
దిశ, వెబ్‌డెస్క్: ఆడవారు.. అమాయకులు, బలం లేని వారు, ఏం చేసినా మాట్లాడరు, బెదిరిస్తే భయపడతారు.. ఇలా ననుకొనే మగవాళ్ళు రెచ్చిపోతున్నారు. ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. గుడి, బడి, ఆఫీస్, ఇల్లు ఎక్కడ ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. తాజాగా ఒక మతగురువు తన పదవి ముసుగులో ఏడాదిగా ఒక యువతిపై అత్యాచారం చేస్తోన్న ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళితే.. పేద కూరపాడు కు చెందిన బాలస్వామి ఆ గ్రామంలోని చర్చి మత గురువు (చిన్న ఫాదర్)గా విధులు నిర్వహిస్తున్నాడు. చర్చికి వచ్చినవారందరికి ప్రార్థనలు చేస్తూ దైవ సేవకే జీవితాన్ని అర్పించినట్లు కల్లోబొల్లి కబుర్లు చెప్పేవాడు. ఇక ఈ మాటలు నమ్మిన మహిళలు ఆయన దగ్గరకు ప్రార్థనలు చేయించుకోవడానికి వెళ్లేవారు. ఇక ఈ నేపథ్యంలోనే గతేడాది డిసెంబర్ లో క్రిస్టమస్ పండుగకు సంబంధించిన ఉత్సవాలలో నృత్య రూపకాన్ని పిల్లలతో ప్రదర్శించటానికి, వారికి నృత్యం నేర్పేందుకు గుంటూరు లో ఒక సంస్థ లో పని చేస్తూ సెలవుపై పెదకూరపాడు వచ్చిన యువతిని నియమించాడు ఫాదర్. ఆమెకూడా ఫాదర్ మాట జావదాటకుండా వారికి డాన్స్ నేర్పించేందుకు చర్చికి వచ్చేది.
ఇక డాన్స్ క్లాస్ అయిపోయాక ఆ యువతిపై బాలస్వామి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి చెప్పవద్దని, తనకు ఏం కావాలన్నా ఇస్తానని, కాదు, కూడదు అంటే తిప్పలు తప్పవని బెదిరించాడు. దీంతో యువతి మిన్నకుండిపోయింది. ఇలా బెదిరిస్తూ గతేడాది నుంచి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసాడు. ఇక ఇటీవల యువతికి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో, ఆమె ఆ విషయాన్నీ ఫాదర్ కి చెప్పింది. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా నిరాకరించి మొహం చాటేశాడు. ఆయన్ను కలిసి తన బాధ చెప్పుకోవడానికి ప్రయత్నిచగా తప్పించుకు తిరుగుతున్నాడని.. పెళ్లి చేసుకోవటం కుదరదని చెప్పటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీస్ లు నిందితుడిపై పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం బాధితురాలిని పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.