జనగామలోని పాస్టర్‌లకు క్రిస్టమస్ బహుమతి

by Shyam |
జనగామలోని పాస్టర్‌లకు క్రిస్టమస్ బహుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: జనగామ నియోజకవర్గంలో అన్ని గ్రామాల పాస్టర్‌లకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. గురువారం జనగామ పట్టణ, మండలాల పాస్టర్ దంపతులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాస్టర్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రతి సంవత్సరం క్రిస్టమస్ రోజున చర్చిలో కరోనా బారి నుండి అందరూ త్వరలోనే కోలుకోవాలని, జనగామ నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని, రైతులు బాగుండాలని పాస్టర్లు అందరూ ప్రార్థన చేయాలని కోరారు. పాస్టర్‌లు చేసే సేవల పట్ల కృతజ్ఞతలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story