- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎరిక్‌సెన్
దిశ, స్పోర్ట్స్: యూరో కప్ 2020లో ఒక మ్యాచ్ సందర్భంగా గుండెనొప్పితో మైదానంలోనే కుప్పకూలిన డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియన్ ఎరిక్‌సెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రిలో పలు టెస్టుల అనంతరం అతడికి హార్ట్ మానిటరింగ్ డివైజ్‌ను అమర్చారు. అనంతరం ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జ్ చేశారు. కాగా క్రిస్టియన్ నేరుగా కోపెన్‌హాగన్ శివారులో ఉన్న డెన్మార్ జట్టు బేస్ క్యాంప్‌కు వెళ్లాడు. సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన క్రిస్టియన్‌ను చూసి జట్టు సభ్యులు ఆశ్చర్యపోయారు. అందరినీ కలసి మాట్లాడి వారిని కౌగిలించుకొని భావోద్వేగానికి గురయ్యాడు.
జట్టుతో కలవడం వల్ల వాళ్లు మానసిక ఆందోళన నుంచి బయటపడే అవకాశం ఉంటుందనే అలా వచ్చినట్లు క్రిస్టియన్ ఎరిక్‌సన్ చెప్పాడు. కాగా. డెన్మార్క్ జట్టు గ్రూపు దశలో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. సోమవారం రష్యాతో జరిగే మ్యాచ్ కనుక గెలిస్తే నాకౌట్ దశకు చేరుకునే అవకాశం ఉంటుంది.