కొడుకుతో ఆ ఫొటోలు తీయించుకున్న స్టార్ కపుల్స్.. నెట్టింట్లో వైరల్

by Shyam |
Chris Hemsworth
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ కపుల్స్ నటుడు క్రిస్ హేమ్స్‌వర్త్ అతని భార్య మోడల్ ఎల్సా పటాకీ ప్రేగ్ తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఈ మేరకు ఎప్పుడూ బిజీ షెడ్యూల్‌లో జీవితాన్ని గడిపే ఈ జంట ప్రస్తుతం కాస్త విరామం దొరకడంతో తమ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు తిరుగుతున్న ప్రాంతాలతో పాటు ఓ రొమాంటిక్ పిక్‌ను షేర్ చేయగా ఆ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ఈ పిక్‌లో గోడమీద ముద్దుపెట్టుకుంటున్న లవర్స్ పెయింటింగ్ ఉండగా.. సేమ్ అదే పద్ధతిలో వీరిద్దరూ ఒకరినొకరు గట్టిగా హత్తుకొని లిప్ కిస్ పెట్టుకున్నారు.

అయితే ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ప్రేగ్..‘వెన్ యు ఫైండ్ ది రైట్ పెయింటింగ్ ఆన్ ది రైట్ మూమెంట్’ అని క్యాప్షన్ ఇస్తూ.. తన కొడుకును ఈ అద్భుతమైన క్షణం కోసం ఫొటో గ్రాఫర్‌గా మార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే తన వివాహబంధం గురించి చెబుతూ..‘మొదట ఏ సంబంధం పరిపూర్ణంగా ఉండదు. మన జీవితాన్ని, బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఓర్పు, సహనం, అవగాహన చాలా అవసరం. మనల్ని మనం తెలుసుకోవడమే కాదు. అవతలి వ్యక్తిని కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఎల్లప్పుడూ అహంకారాన్ని దరిదాపుల్లోకి రానివ్వకూడదు’ అంటూ వివరించింది. ఇక హాలీవుడ్ అందమైన జంటల్లో ఒకరైన ఈ కపుల్స్ 2010లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story