చితక్కొట్టిన గేల్

by Shyam |
చితక్కొట్టిన గేల్
X

దిశ, స్పోర్ట్స్: వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించినా లీగ్స్ మాత్రం ఆడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా అక్కడ హాట్ ఫేవరెట్‌గా గేల్ ఉంటాడు. తాజాగా గేల్ అబుదాబిలో జరుగుతున్న టీ10 టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. అబుదాబి జట్టు తరపున ఆడుతున్న గేల్ బుధవారం మరాఠా అరేబియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కేవలం 22 బంతుల్లో 84 పరుగులు బాదాడు.

ఇందులో 9 సిక్సులు, 6 ఫోర్లు ఉండటం గమనార్హం. క్రీజ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి బౌండరీలతో విరుచుకపడిన గేల్ కేవలం 12 బంతుల్లోనే అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీ10 చరిత్రలో వేగవంతమైన అర్దసెంచరీ చేసిన మహమ్మద్ షెహజాద్ రికార్డును సమం చేశాడు. గేల్ చెలరేగడంతో మరాఠా అరేబియన్స్ నిర్దేశించిన 98 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5.3 ఓవర్లలోనే ఛేదించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed