- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాయ్ ఫుల్.. జైల్ ఫుల్.. సురేఖతో చిరు
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వాడకం.. నాతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదన్నట్లు ఉంటుంది. సందర్భాన్ని బట్టి వీడియోను పోస్ట్ చేయడంలో ఘనుడు అనిపించుకుంటున్న మెగాస్టార్ పోస్టులు సూపర్ అనిపించుకున్నాయి. సోషల్ మీడియాలో తనకు వెల్ కమ్ చెప్పిన నటులను తనదైన పంచ్ లతో విష్ చేయడం నుంచి.. # betheREALMAN చాలెంజ్, హనుమాన్ తో అనుబంధం, మదర్స్ డే స్పెషల్ వీడియో వరకు ప్రతీ ఒక్కటి ప్రేక్షకులను అలరించాయి. సమాజం పట్ల బాధ్యతను పెంచే కరోనా క్రైసిస్ చారిటీ విరాళం సేకరణ, బ్లడ్ డొనేషన్ లాంటి విడియోలు కూడా షేర్ చేసిన చిరు.. సరికొత్తగా భార్య సురేఖ తో ఉన్న అనుబంధం గురించి ఒకప్పటి, ఇప్పటి పరిస్థితులను కంపేర్ చేస్తూ ఓ ఫోటోను షేర్ చేశాడు. దానికి తనదైన స్టైల్ లో ఓ కామిక్ క్యాప్షన్ కూడా యాడ్ చేశాడు చిరు.
https://www.instagram.com/p/CAUWQ2TDyrd/?utm_source=ig_web_copy_link
తాను నేను.. కాలం మారినా.. దేశం మారినా.. మా అనుబంధం మారలేదు అంటూ పోస్ట్ పెట్టాడు చిరు. జాయ్ ఫుల్ హాలిడే ఇన్ అమెరికా 1990.. జైల్ ఫుల్ హాలీడే ఇన్ 2020 పేరుతో పిక్ పెట్టగా.. ఇందులో అప్పుడూ, ఇప్పుడూ బ్లూ డ్రెస్ లో చిరు, రెడ్ శారీలో సురేఖ ఉండగా.. చిరు వంట చేస్తూ గరిట తిప్పుతుంటే.. సురేఖ బాక్స్ పట్టుకుని నిలుచుంది. అఫ్ కోర్స్ చిరు పిక్ కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవడంలో వింతేముంది.