ఇంతకు మించిన సంతృప్తి మరొకటి ఉంటుందా: చిరు

by Shyam |
ఇంతకు మించిన సంతృప్తి మరొకటి ఉంటుందా: చిరు
X

‘రక్త దానం చేయండి.. ప్రాణదాతలు కండి’ అని పిలుపునిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. జీవితంలో చాలా సంతృప్తిని మిగిల్చిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటానని తెలిపిన చిరు.. రక్తదానం గొప్పతనాన్ని చాటుతూ ఓ వీడియో షేర్ చేశాడు. ‘బ్లడ్ డోనార్ డే’ను పురస్కరించుకుని అభిమానులతో వీడియో పంచుకున్న ఆయన.. ‘ఒక జీవితాన్ని కాపాడటం కన్నా గొప్ప సంతృప్తి’ ఎక్కడ దొరుకుతుంది. ఎన్నిసార్లు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.. ప్రజలు ఎన్నిసార్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి’ అనిపిస్తుందన్నారు చిరు. మానవాళికి ఇంత గొప్ప సూపర్ పవర్ ఇచ్చిన సర్వశక్తిమంతుడికి ధన్యవాదాలు తెలిపారు.

ఆపదలో ఉన్న ఎంతో మందికి తను స్థాపించిన ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ ద్వారా ప్రాణదానం చేసిన చిరంజీవి.. నిజంగా దేవుడని ప్రశంసిస్తున్నారు అభిమానులు, ప్రముఖులు. ‘ఈ వీడియో మరింత మంది రక్తదానం చేసేందుకు ముందుకొచ్చేలా ఉపయోగపడుతుంది అన్నయ్య’ అంటున్నారు.

కాగా ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరు నక్సలైట్‌గా కనిపించనుండగా.. రామ్ చరణ్ తేజ్ స్టూడెంట్ లీడర్‌గా నటించనున్నాడని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed