చిరు తీసిన ఫస్ట్ ఫొటో!

by Shyam |
చిరు తీసిన ఫస్ట్ ఫొటో!
X

సోషల్ మీడియా వాడకం ఎలా ఉండాలో చూపించాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రతీ ఈవెంట్‌కు, ప్రతీ ఫెస్టివల్‌కు, ప్రతీ అకేషన్‌కు స్పెషల్ పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్‌కు మరింత దగ్గరవుతూ.. సూపర్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్న చిరు.. వరల్డ్ ఫొటోగ్రఫి సందర్భంగా మరో స్పెషల్ పోస్ట్ పెట్టాడు.

తను ఇలాంటి కెమెరాతో ఫొటో తీశానని బుధవారం ఉదయం ఏజీఎఫ్ఏ 3 కెమెరా పిక్చర్‌ను షేర్ చేసిన చిరు.. సాయంత్రం తను తీసిన ఫస్ట్ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. డాబా మీద ఐదుగురు చిన్న పిల్లలతో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేసిన చిరు.. ఇందులో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు చెప్పుకోండి చూద్దాం! అన్నారు.

దీంతో ఈ పనిలో పడిపోయిన మెగా ఫ్యాన్స్ అంత కష్టపడకుండానే ఆ అబ్బాయి ఎవరో చెప్పేశారు. వావ్.. ‘ఇది స్వీట్ ఫొటో చిరు సర్’ అంటూ.. ఇందులో ఉంది మరెవరో కాదు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేశారు అభిమానులు. ఇంత అమూల్యమైన ఫొటో షేర్ చేసినందుకు థాంక్స్ చెప్పారు.

Advertisement

Next Story