చిరు సర్జాను రీప్లేస్ చేయనున్న సోదరుడు

by Shyam |
చిరు సర్జాను రీప్లేస్ చేయనున్న సోదరుడు
X

కన్నడ హీరో చిరంజీవి సర్జా ఆకస్మిక మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా చిరు భార్య.. ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతోంది. అటు చిరు సర్జా చేసిన ‘రాజమార్తాండ’ చిత్రం కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇది పాటల రచయిత రామ్ నారాయణ్ డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన తొలిచిత్రం కాగా.. సాంగ్ షూటింగ్, డబ్బింగ్ పూర్తి కావాల్సి ఉంది.

కాగా, చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా సినిమాను పూర్తి చేద్దామని ముందుకొచ్చాడంట. మిగిలిపోయిన సాంగ్‌ను కంప్లీట్ చేయడంతో పాటు డబ్బింగ్ కూడా చెప్తానన్న విషయాన్ని డైరెక్టర్ రామ్ నారాయణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంతకన్నా బెటర్ సపోర్ట్ ఎక్కడైనా చూడగలమా.. చిరుకు ఇంత గొప్ప జస్టిఫికేషన్ ఎవరైనా ఇవ్వగలరా? అని ప్రశంసించారు. ‘చిరు మరణంతో దుఖంలో ఉన్న కుటుంబం ఇతరుల గురించి ఇంత గొప్పగా ఆలోచించి.. సినిమాకు న్యాయం చేయడం.. రాజమార్తాండ చిత్రం విడుదలకు హెల్ప్ చేయడం చిరుకు ఇచ్చే గొప్ప నివాళి’ అని తెలిపారు.

Advertisement

Next Story