- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలు ఊపిరే.. రాగం, తానం, పల్లవి : చిరు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతుండగా.. సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగిరావాలని కోరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాలు తనకు సోదర సమానుడని.. తనతో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని చెప్పారు. బాలును అన్నయ్య అని పిలుస్తానని.. తన చెల్లెళ్లు ఎస్పీ వసంత, ఎస్పీ శైలజ కూడా నన్ను అన్నయ్యలా చూసుకునే వారని తెలిపారు. వారితో మాట్లాడి బాలు ఆరోగ్య సమాచారం తెలుసుకున్నానన్న చిరు.. రోజు రోజుకు ఆయన ఆరోగ్యం మెరుగవుతుందన్న వార్త తనకు సంతోషాన్నిచ్చిందని అన్నారు.
బాలు త్వరగా కోలుకోవాలని.. ఎప్పటిలాగే కోట్లాది మంది అభిమానులను తన గాత్రంతో ఉర్రూతలూగించాలని కోరారు. భారతీయ సినిమాకు ఆయన ఊపిరే రాగం, తానం, పల్లవి అన్న చిరు.. అభిమానుల ప్రార్థనలు, దేవుని ఆశీర్వాదంతో బాలు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని.. రెట్టించిన ఉత్సాహంతో తన గాత్రంతో దేశ ప్రజలను అలరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.