మోడీ పిలుపుపై చిరు ట్వీట్

by Shyam |
మోడీ పిలుపుపై చిరు ట్వీట్
X

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న చర్యలపై ప్రధాని మోడీని ప్రశంసించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. లాక్ డౌన్ విధించి 130 కోట్ల భారతీయులను ఇళ్లకు పరిమితం చేసి కరోనా వ్యాప్తి చెందకుండా చేసిన మోడీ… ఈ క్రమంలోనే ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పేసి… దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

మోడీ పిలుపు పై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మోడీ పిలుపును గౌరవించాలని ప్రజలను కోరారు. దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారదొలాలని కోరారు చిరు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒకరి కోసం ఒకరం నిలబడదామని పిలుపునిచ్చారు.

Tags: Chiranjeevi, Modi, PM, CoronaVirus, Covid 19

Advertisement

Next Story