- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగాస్టార్ లుక్ కు చెర్రీ ఫిదా…
దిశ, వెబ్ డెస్క్:
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్ చేస్తేనే సోషల్ మీడియా రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి.. అలాంటిది కొత్త లుక్ లో.. అది కూడా ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో.. అసలు ఊహకందని రీతిలో కనిపిస్తే అభిమానులకు ఎలా ఉంటుంది? సూపర్ కిక్ ఇస్తుందిగా.. అసలు అభిమానుల మాట పక్కన పెట్టండి.. ఎక్కడో ఉన్నా అభిమానులు కాదు పక్కనే ఉన్న తనయుడు, మెగా పవర్ స్టార్ ఆశ్చర్యపోయాడు అంటే అర్థం చేసుకోండి ఎంత డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ లుక్ లో కనిపించాడో.
చిరు అర్బన్ మాంక్ హాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసిన ఫొటోలో పూర్తిగా గుండుతో నార్మల్ షేవ్.. సూపర్ కూల్ స్పెట్స్ తో సూపర్ డూపర్ లుక్ తో రప్ఫాడించేసాడు చిరు. దీంతో ఈ పిక్ చూసిన చరణ్ .. అప్పా.. నేను ఇప్పుడు ఏం చూశాను అసలు అంటూ ఆశ్చర్యపోయాడు. మెగాస్టార్ పిక్ కు మెగా రేంజ్ లో రెస్పాన్స్ రాగా… భవిష్యత్ లో చేయబోయే ఒక సినిమా లోదే ఈ లుక్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఆచార్య సినిమా తరువాత వి వి వినాయక్ తో లూసి ఫర్ రీమేక్ లో, తరువాత మెహర్ రమేష్ తో వేదాలం రీమేక్ లో నటించనున్నట్లు తెలుస్తుండగా… లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ స్టిల్ ఈ రెండిట్లో ఏదో ఒక సినిమాలోది అయి ఉంటుందని అంటున్నారు. అయితే ఇది వెదాలం రీమేక్ లోని ఓ గెటప్ అని మేజర్ ఓట్లు పడుతుండగా.. మరి ఏ సినిమాలో ఈ గెటప్ తో నటిస్తారో తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.