చిరు ‘మెగా’ రికార్డు.. సినీ ప్రపంచంలో ఇదే తొలిసారి..

by Shyam |
చిరు ‘మెగా’ రికార్డు.. సినీ ప్రపంచంలో ఇదే తొలిసారి..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్లీ సినీ ఫీల్డ్‌కి వచ్చినప్పటి నుంచి జోరు కనబరుస్తున్నారు. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో మూడు సినిమాలను ఓకే చేశారు. అయితే తాజాగా చిరు మెగా రికార్డ్ సాధించాడు. సినీ ప్రపంచంలో ఇలాంటి రికార్డు సాధించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏ హీరో ఈ ఫీట్ చేయలేదు.

అదేంటంటే.. ఒకే నెలలో వరుసగా నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లడం. అవును.. ప్రస్తుతం చిరు ఒక్క నెలలోనే నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’, బాబీ డైరెక్షన్‌లో చిరు154, మెహర్ రమేష్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, మోహన్ రాజా డైరెక్షన్‌లో ‘గాడ్ ఫాదర్’ సినిమాలను ఈ నెలలో పట్టాలెక్కిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ‘మెగా’మేళా చేస్తున్నారు.

Advertisement

Next Story