జనాన్ని మేల్కొలిపే పోలీసు పాట… చిరు మాట

by Shyam |
జనాన్ని మేల్కొలిపే పోలీసు పాట… చిరు మాట
X

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో ఒక్కరు చేసిన తప్పుకు పది మంది చనిపోయే ప్రమాదం ఉంది. ఒక్కరి ద్వారా వందల మందికి వైరస్ సోకే ఛాన్స్ ఉంది. అందుకే అలాంటి తప్పు చేయొద్దు అంటున్నారు పోలీసులు… హాంతకులుగా మిగలొద్దని హెచ్చరిస్తున్నారు.

“ఇది అంతా నీ వల్లే జరుగుతుంది రా… జరగకుండ కళ్లు తెరిచి ఇంట్లోనే ఉండరా.. నీకు నువ్వే చేసుకోకు జీవిత ద్రోహం.. నీ కుటుంబానికి చేయకు నమ్మక ద్రోహం.. రోగముండి చెప్పకుంటే సాంఘిక ద్రోహం… రోడ్ల మీద తిరగడమే దేశ ద్రోహం…”

కరోనా మహమ్మారి కారణంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ పాటను విడుదల చేశారు సైబరాబాద్ పోలీసులు. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాసిన ఈ పాటను శ్రీ కృష్ణ ఆలపించారు. కాగా ప్రజలను మేల్కొలిపే దిశగా ఈ పాటను రూపొందించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను ప్రశంసించారు చిరు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులు, ప్రజల బాధ్యతను తెలుపుతూ గొప్పగా పాటను రాసిన జొన్నవిత్తులను, పాడిన శ్రీ కృష్ణను అభినందించారు.


Tags: Chiranjeevi, Cyberabad police, Awareness song, CoronaVirus, Covid19

Advertisement

Next Story

Most Viewed