ఆచార్య షూటింగ్ మొదలైనట్టే..

by Shyam |
ఆచార్య షూటింగ్ మొదలైనట్టే..
X

ప్రతీ రంగాన్ని కుదిపేసిన కరోనా వైరస్.. సినీ ఇండస్ట్రీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. సినిమా షూటింగ్స్ వాయిదా పడటంతో సినీ కార్మికులకు బతుకుదెరువు భారమైంది. తినడానికి తిండి కూడా లేని కార్మికులను కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా ఇండస్ట్రీ పెద్దలు ఆదుకోగా.. వారికి మళ్లీ మంచిరోజులు రానున్నాయి. జూన్ నుంచి షూటింగులు మొదలు కానున్నాయి. ‘రోల్ కెమెరా స్టార్ట్ యాక్షన్’ అంటూ సినీ ఇండస్ట్రీ మళ్లీ బిజీ అయిపోనుంది. ‘తిండి లేకపోయినా సరే.. సెట్‌లో ఉంటే చాలు అదే మా ఆకలి తీరుస్తుంది’ అని చెప్పుకునే కార్మికులకు ఇది గుడ్ న్యూసే.

ఈ క్రమంలో ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది అనేది ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా కథ దేవాలయ భూముల ఆక్రమణ నేపథ్యంలో సాగనుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపంచనున్న ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకోగా.. జూన్ 15 నుంచి సినిమా షూటింగ్ మళ్లీ మొదలవుతుందని సమాచారం. చిరు 152వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఆయనకు జోడీగా కనిపించబోతుండగా.. ఈ సినిమాను అనుకున్న టైమ్‌కు పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు టాక్.

Advertisement

Next Story

Most Viewed