- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీసీసీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు వ్యాక్సినేషన్
దిశ, సినిమా : తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులను కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) ముందుకొచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ రోజు(మంగళవారం) తెలిపారు. అపోలో 24/7 సౌజన్యంతో 45 ఏళ్లు నిండిన సినీ కార్మికులు, వారి జీవిత భాగస్వాములకు కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
గురువారం నుంచి నెలరోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందన్న చిరు..కార్మికులు ఇందుకోసం వారి వారి యూనియన్లలో ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకున్న సినీ కార్మికులు ఉచితంగా అపోలో డాక్టర్లను సంప్రదించొచ్చని, మందుల పంపిణీలోనూ రాయితీ ఉంటుందని తెలిపారు. కరోనా నుంచి సినీపరిశ్రమను కాపాడుకుందామని, అర్హులైన వారు ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.#GetVaccinated#WearMask #StaySafe pic.twitter.com/NpIhuYWlLd
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021
Tags:
slug:
photo: Chiranjeevi…apollo 24/7