- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనందయ్య మందుపై చిన్నజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై చినజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిని సందర్శించిన చిన్నజీయర్ స్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆనందయ్య మందు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవని అన్నారు. దీనిని ఆయూష్ కమిటీ కూడా నిర్ధారించిందని తెలిపారు. మందును ఉచితంగా ఇస్తున్నారు.. దీనికి ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు.
ఆనందయ్య ప్రాణాలు కాపాడుతుంటే ఎందుకు వివాదం అవుతోందని మండిపడ్డారు. ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం కాగానే, సడన్‌గా కొత్త ప్రొటోకాల్స్ వచ్చాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి విస్తరిస్తోన్న విపత్కర పరిస్థితుల్లో వివాదాలు చేయడం సరికాదని హితవు పలికారు. వ్యవస్థ అల్లోపతిని అంగీకరించిందని, మంచి ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ధైర్యం ఇవ్వాలి కానీ.. పరిస్థితులు భయపెట్టేలా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.