Srishailam: నల్లమల్ల ఫారెస్ట్ లో పెద్దపులి కలకలం

by Ramesh Goud |
Srishailam: నల్లమల్ల ఫారెస్ట్ లో పెద్దపులి కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: నల్లమల ఫారెస్ట్‌లో(Nallamalla Forest) పెద్దపులి(Tiger) సంచరిస్తున్న వీడియో కలకలం రేపింది. శ్రీశైలం ఘాట్ రోడ్డులోని టైగర్ సఫారీలో కొందరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. మున్ననూరు- శ్రీశైలం ఘాట్ రోడ్డు(Munnanur-Srisailam Ghat road)లోని ఫరహాబాద్(Farahabad) వద్దకు రాగానే అకస్మాత్తుగా ఓ పెద్దపులి ఫారెస్ట్ లో తిరుగుతూ వారి కంటపడింది. ఇది చూసిన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఆ ప్రయాణికులు పెద్దపులిని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నల్లమల్ల అడవిలో పెద్దపులి గంభీరంగా తిరుగుతున్న వీడియో నెట్టింట వైరల్(viral) గా మారింది. దీనిపై ఇటీవల తెలంగాణలో పులుల దాడులలో చాలామంది గాయపడ్డారని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని పెద్ద పులి జనావాసంలోకి రాకుండా చూడాలని కోరుతున్నారు. అంతేగాక శ్రీశైలం ఘాట్ రోడ్డులో హెచ్చరికలు జారీ చేసి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడాలని సూచిస్తున్నారు.

Next Story