వైరస్ లేక చైనాకు తిప్పలు

by Shyam |   ( Updated:2020-07-13 05:44:10.0  )
వైరస్ లేక చైనాకు తిప్పలు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్‌కు పుట్టినిల్లైన చైనాకు ఇప్పుడు వింత పరిస్థితి ఎదురైంది. కోవిడ్-19 చైనాలో బయటపడిన తర్వాత ఆ దేశంలో కల్లోలం సృష్టించింది. వేలాది మందికి వ్యాపించి.. అదే స్థాయిలో అనేక మంది ప్రాణాలను బలిగొంది. ఈ వైరస్ నివారణకు చైనా వ్యాక్సిన్ కనుగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో వాళ్ల వ్యాక్సిన్ తయారీకి అంతరాయం ఏర్పడింది.

చైనాలో గతంలో ఆ దేశ కాన్సినో బయోలాజిక్స్ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ 3వ దశ క్తినికల్ ట్రయల్స్‌కు చేరుకుంది. అయితే ప్రస్తుతం చైనాలో కరోనా లేకపోవడంతో క్లినికల్ ట్రయల్స్‌కు అవరోధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్లినికల్ ట్రయల్స్ కోసం చైనా ఇతర దేశాల పైన ఆధారపడాల్సి వస్తోంది.

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాలైన రష్యా, చిలీ, సౌదీ అరేబియా, బ్రెజిల్ దేశాలతో కాన్సివో బయోలిజిక్స్ ప్రతినిధులు జరుపుతున్నారు. తమకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేలా అనుమతి ఇవ్వాలని
కోరుతున్నారు. ఆ సంస్థ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కోసం 40 వేల మంది వాలంటీర్లకు వ్యాక్పిన్ ఇచ్చి, ఫలితాలను ఫైనల్‌కు తీసుకురావాలని కాన్సినో బయోలాజిక్స్ ప్రయత్నిస్తోంది.

Advertisement

Next Story