- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఘనంగా చింపు బర్త్ డే సెలబ్రేషన్స్
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో చింపాంజి పుట్టిన రోజు వేడుకలు కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి మూలంగా నిరాడంబరంగా జరిగాయి. ప్రతి సంవత్సరం చింపాంజీ (సుజి) పుట్టినరోజు వేడుకలను జూ సిబ్బంది సందర్శకుల మధ్యలో ఘనంగా నిర్వహించేవారు. ఈ ఏడాది కరోనా కారణంగా జూలోకి అనుమతి లేకపోవటంతో బర్త్ డేను నిరాడంబరంగా జరిపారు. గదిలో చింపాంజీ ముందు పళ్లతో తయారు చేసిన కేక్‌ను ఉంచటంతో అది సంబురపడుతూ దాన్ని తినేసింది. కాగా ఈ బర్త్ డేతో సుజి 33 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. కేక్ కటింగ్ తర్వాత రొట్టెలను సుజీకి ఆహారంగా అందించారు. ఈ చింపాంజీని 2011లో సహారా గ్రూప్ వారు జూకి బహుమతిగా ఇచ్చారు. దాంతో అప్పటినుంచి ఇది జూలో సందర్శకులను ఆకట్టుకుంటుంది. సుజి చాలా మంచిదని, సందర్శకులు దానిని చూసి చాలా సంతోషపడతారని జూ సిబ్బంది అంటున్నారు.