చిరుసాయం.. గొంతు కలిపారు

by Sridhar Babu |   ( Updated:2020-03-31 06:20:59.0  )
చిరుసాయం.. గొంతు కలిపారు
X

దిశ, కరీంనగర్
కరోనా నివారణకు ఆ చిన్నారులు తమ పెద్దమనుసును చాటుకున్నారు. సిరిసిల్ల పట్టణం బీవై‌నగర్‌కు చెందిన చిన్నారులు సాహితీ, హరిచరణ్‌లు మహర్షి పాఠశాలలో నాలుగో తరగతి, రెండో తరగతి చదువుతున్నారు. కరోనా కట్టడిపై జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు, క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నా అవగాహన కార్యక్రమాలు చిన్నారులను ఆలోచింపజేశాయి.
కరోనాకు చికిత్స లేదు నివారణ ఒక్కటే మార్గం అని తెలుసుకున్న వారు వ్యాధి సోకకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని భావించి తమ తండ్రి ప్రవీణ్ కు తెలిపారు.తెలంగాణ సాంస్కృతిక సారథిగా విధులు నిర్వర్తిస్తూ మరోపక్క ప్రవృత్తిగా రికార్డింగ్ స్టూడియో నిర్వహిస్తున్న ప్రవీణ్ కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆ చిన్నారుల కోసం పాటను రచించారు. మాయదారి కరోనా అంటూ రచించిన ఈ పాటను చిన్నారి సాహితీ పాడగా, హరిచరణ్ పాటను చిత్రీకరించారు.
ఈ పాటను మంగళవారం సిరిసిల్ల కలెక్టర్ కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆవిష్కరించారు. చిన్న వయసులోనే కరోనా మహమ్మారిపై పాటల రూపంలో పోరాటం చేసేందుకు సిద్ధమైన చిన్నారులను అభినందించారు. చిన్నారుల ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషిచేయడంతో పాటు వారిని ప్రోత్సహించిన ప్రవీణ్ ను కూడా కలెక్టర్ అభినందించారు.
చిన్నారులు సాహితీ, హరిచరణ్ తాము కిడ్డీ బ్యాంక్ లో దాచుకున్న రూ. మూడు వేల నగదును కరోనా నియంత్రణ చర్యల కోసం ఉపయోగించేందుకు కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి మామిండ్ల దశరథం, ,తెలంగాణ సాంస్కృతిక సారథి దొబ్బల ప్రకాష్ లు పాల్గొన్నారు.

Tags: two childrens, donate, kiddibank,siricilla collector,krishan bhaskar

Advertisement

Next Story

Most Viewed