‘అచేతనలో బాలల హక్కుల కమిషన్’

by Shyam |

దిశ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అలంకార ప్రాయంగా మారిందని బాలల హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బి.అచ్యుతరావు విమర్శించారు. కమిషన్‌ను నియమించి నాలుగు నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటివరకు కార్యాలయం కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఐదుగురు సభ్యులకు, చైర్ పర్సన్‌కు ఎలాంటి జీతభత్యాలూ ఇవ్వట్లేదని ఆరోపించారు. అంతేకాకుండా వారికి అవగాహన కార్యక్రమాలనూ ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. దీన్నిబట్టి బాలల హక్కుల పట్ల ప్రభుత్వానికి ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బాలల హక్కుల కమిషన్ అచేతనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్‌కు కావాల్సిన సదుపాయాలను ప్రభుత్వం ఇప్పటికైనా కల్పించి, పిల్లల హక్కుల పరిరక్షణకు విఘాతం కలగకుండా చూడాలని ఓ ప్రకటనలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed