పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి

by Anukaran |
పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతిచెందారు. వివరాల ప్రకారం.. భోపాల్‌లోని కమల నెహ్రు ఆసుపత్రి పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉండగా అందులో 36 మంది క్షేమంగా ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న చిన్నారుల బంధువులు అక్కడికి పరుగులు తీశారు. దీంతో ఆసుపత్రి లోపల, బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి విశ్వాస్​సారంగ్ స్పందించారు. మృతుల తల్లిదండ్రులకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని పేర్కొన్నారు. అయితే షార్ట్​సర్క్యూట్​కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed