వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి..

by Sridhar Babu |
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి..
X

దిశ,జగిత్యాల: జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మగ బిడ్డ పుట్టాడని ఎంతో సంబరపడ్డ ఆ తల్లి పుట్టిన శిశువును తనివితీరా చూడకుండానే తనువు చాలించింది. జగిత్యాల పట్టణంలోని మోతె రోడ్డులో నివాసం ఉంటున్న గుర్రాల పద్మ-పవన్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు సంతానం కాగా మూడవ ప్రసవం కోసం సోమవారం ఉదయం 4 గంటల సమయంలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పద్మకు పెద్ద ఆపరేషన్‌ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పద్మ కొద్దిసేపటికే మృతి చెందింది. వైద్యులు ఆపరేషన్ అనంతరం కుట్లు సరిగ్గా వేయకపోవడంతోనే పద్మ మృతి చెందిందని మృతురాలి కుటంబ సభ్యులు ఆసుప్రతిలో ఆందోళనకు దిగారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న జగిత్యాల పట్టణ సీఐ జయేష్‌రెడ్డి, ఎస్సై శివకృష్ణ ఆందోళన చేస్తున్న వారి నుంచి వివరాలు సేకరించారు.

Advertisement

Next Story