- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూబ్యూబ్ బిగ్గెస్ట్ చైల్డ్ స్టార్‌తో అమెజాన్ డీల్
దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందుతున్న వరల్డ్ టాప్ యూట్యూబర్స్‌లో రాయన్ కాజీ ఒకరు. వయస్సు 9 ఏళ్లే అయినప్పటికీ కోట్లలో సంపాదిస్తూ రికార్డులు సృష్టించాడు. ‘రాయన్స్ వరల్డ్’ పేరుతో తన చానల్‌లో పిల్లల బొమ్మలు రివ్యూ చేస్తూ, వివిధ గేమ్స్ ఆడుతూ, విభిన్న రకాల ఎడ్యుకేషన్ వీడియోలు పెడుతూ.. రాయన్, అతని ఫ్యామిలీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఆ పాపులారిటీని ఇప్పుడు అమెజాన్ సొమ్ము చేసుకోవాలనుకుంటోంది. మొదటిసారిగా తమ అమెజాన్ కిడ్స్ ప్లస్ ఓటీటీ కోసం ఒక యూట్యూబర్‌తో అమెజాన్ డీల్ చేసుకుంది. ఈ డీల్‌లో భాగంగా రాయన్ ఒక ఒరిజినల్ యానిమేటెడ్ సిరీస్‌తో కనిపించబోతున్నాడు.
‘సూపర్ స్పై రాయన్’ అనే పేరున్న ఈ యానిమేషన్ సిరీస్‌లో రాయన్.. పాక్రాట్ అనే విలన్‌తో పోరాడబోతున్నట్లు ప్రెస్ రిలీజ్‌లో రాయన్ తండ్రి షియోన్ కాజీ తెలిపారు. ఈ సిరీస్‌లో రాయన్‌తో పాటు కాజీ కుటుంబం కూడా కనిపించబోతోందని షియోన్ చెప్పారు. ఇప్పటికే వివిధ పిల్లల చానళ్లతో రాయన్ ఫ్యామిలీ ఒప్పందాలు చేసుకుని, తమ యూట్యూబ్ ప్రపంచాన్ని స్ట్రీమింగ్ సర్వీస్‌లకు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే అమెజాన్, హెచ్‌బీవో మ్యాక్స్ లాంటి స్ట్రీమింగ్ సర్వీస్‌లు కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా కంటెంట్ సిద్ధం చేయడానికి యూట్యూబర్ల సాయం తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే రాయన్‌కు ఇప్పటికే రాయన్ అండ్ ఫ్రెండ్స్ అనే ఓటీటీ సర్వీస్ ఉన్నప్పటికీ అమెజాన్ లాంటి పెద్ద సంస్థతో ఒప్పందం వల్ల వారి రీచ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ డీల్‌కు ఒప్పుకున్నట్లు షియోన్ కాజీ వివరించారు.