మైనర్ మ్యారేజ్.. చివరి నిమిషంలో బాలిక జీవితాన్ని కాపాడారు

by Sumithra |
మైనర్ మ్యారేజ్.. చివరి నిమిషంలో బాలిక జీవితాన్ని కాపాడారు
X

దిశ, సదాశివపేట : మైనర్ బాలిక వివాహాన్ని చివరి నిమిషంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. పట్టణంలోని N గార్డెన్ పంక్షన్ హల్‌లో ఓ వ్యక్తికి మైనర్ బాలికతో వివాహం జరిపిస్తున్నారని సమాచారం అందడంతో జిల్లా చైల్డ్ ప్రోటెక్షన్ సెల్ అధికారులు చివరి నిమిషంలో వచ్చి అడ్డుకున్నారు.

బాధిత మైనర్ సదాశివపేట మండలం ముబారక్ పూర్ గ్రామానికి చెందిన పూజితగా గుర్తించారు. అమ్మాయిని వెంటనే సఖి సెంటర్‌కు తరలిస్తామని ICDS అధికారులు ప్రశాంతి, విమల పేర్కొన్నారు. బాలికకు వయోపరిమితి నిండకముందే వివాహం చేయాలని చూసిన ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులపై చర్యలకు ఆదేశిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed