12 గంటల్లో వీడనున్న చిన్నారి మర్డర్ మిస్టరీ.. కడుపులో బలంగా తన్నడంతో..?

by Sumithra |
12 గంటల్లో వీడనున్న చిన్నారి మర్డర్ మిస్టరీ.. కడుపులో బలంగా తన్నడంతో..?
X

దిశ, ఖైరతాబాద్ : గత మూడు రోజుల కిందట పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న 4 ఏళ్ల బాలిక మర్డర్ మిస్టరీ కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. పండుగ వేళ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఈ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 9 బృందాలను రంగంలోకి దింపి విచారణ చేపట్టారు.

ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పంజాగుట్ట బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని సుమారు వందకు పైగా సీసీ కెమెరాల పుటేజీలను నిశితంగా పరిశీలించిన పోలీసులు ఆ దిశగా విచారణను వేగవంతం చేసినట్లు తెలిసింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం చిన్నారిని కడుపులో బలంగా తన్నడం వల్లే మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. మొదట అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా భావించిన పోలీసులు తర్వాత హత్య కింద కేసు నమోదు చేసి విచారణను మరింత వేగవంతం చేశారు.

పంజాగుట్ట పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించగా, మరో నాలుగు టాస్క్ఫోర్స్ బృందాలు ఈ కేసును చేధించే పనిలో నిమగ్నమయ్యాయి. దర్యాప్తు బృందాల విచారణలో చిన్నారి హత్య కేసులో సవతి తల్లి ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. మరో 12 గంటలలో విచారణను పూర్తి చేసి మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed