- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కూతురు మేజర్ కాకముందే తల్లిదండ్రుల దుస్సాహసం
దిశ, గజ్వేల్ : తమ కూతురు మేజర్ కాకముందే తల్లిదండ్రులు బాల్యవివాహానికి యత్నించారు. ఈ ఘటన ములుగు మండలంలోని కొత్తూరు గ్రామం గురువారం వెలుగుచూడగా సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అడ్డుకున్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ వెంకట రాజమ్మ, డీసీపీయూ విభాగం నుండి బాలల సంరక్షణ అధికారి రాజు, కొత్తూరు గ్రామం వార్డు సభ్యులు, వీఆర్ఓ, పంచాయతీ సెక్రెటరీ కలసి బాల్య వివాహం జరుగుతున్న ఇంటిని సందర్శించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాల గురించి పెద్దలకు వివరించారు.
అబ్బాయికి 21ఏళ్లు, అమ్మాయికి 18ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించగా, బాలిక తల్లిదండ్రులు అందుకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. సీడీపీవో వెంకటరాజమ్మ మాట్లాడుతూ.. ఎవరైనా చిన్న వయస్సులో పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం అబ్బాయికి (21), అమ్మాయికి(18) ఏళ్లు పూర్తయ్యాకే వివాహం చేయాలని మరోసారి స్పష్టంచేశారు. ఎక్కడైనా బాల్య వివాహం చేస్తున్నారని తెలిస్తే 1098 నెంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆమె కోరారు.