బకెట్‌లో పడి బాలుడు మృతి.. ఎలా జరిగిందంటే..?

by Sumithra |   ( Updated:2021-08-28 07:34:36.0  )
బకెట్‌లో పడి బాలుడు మృతి.. ఎలా జరిగిందంటే..?
X

దిశ, కుత్బుల్లాపూర్: ప్రమాదవశాత్తు బకెట్‎లోని నీటిలో పడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దండమూడి ఎన్‌క్లేవ్ బీహెచ్ఈఎల్ కాలనీలో ప్రదీప్‌‌‌‌‌, అతడి భార్య, కొడుకు హిమాన్షు(13 నెలల బాబు)తో నివాసం ఉంటున్నారు. గత 15 రోజుల క్రితం తల్లి ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా బాబు ఆడుకుంటూ ఓ బకెట్‌ వైపు వెళ్లాడు. నీటితో ఆడుకుంటూ ఒక్కసారిగా తలకిందులుగా బకెట్‌లో పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులుగా చికిత్స పొందుతూ బాబు శనివారం మృతి చెందాడని సీఐ రమేష్ వివరణ ఇచ్చారు. కండ్ల ముందే ఆడుకుంటున్న కొడుకు అకాల మరణం చెందడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story