సమస్యల పరిష్కారం వరకూ.. వాళ్ల వెంటే ఉంటాం : చీప్ విప్ వినయ్ భాస్కర్

by Shyam |
సమస్యల పరిష్కారం వరకూ.. వాళ్ల వెంటే ఉంటాం : చీప్ విప్ వినయ్ భాస్కర్
X

దిశ, కాజీపేట్: కాజీపేట డివిజన్లో నెలకొన్న రైల్వే సమస్యలు పరిష్కారమయ్యే వరకు రైల్వే జేఏసి సంఘం కు పూర్తి మద్దతు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో కాజీపేట చౌరస్తాలో ఆదివారం రైల్వే సమస్యల పరిష్కారం కోరుతూ 30 గంటల నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నగర మేయర్ గుండు సుధారాణి లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోరుతూ పోరాటం చేస్తున్న రైల్వే జేఏసికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మేయర్ గుండు సుధారాణి, లతోపాటు తదితరులు ప్రసంగించారు.

Advertisement

Next Story