- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటిపై పన్నులు రద్దు చేసిన ఘనత కేసీఆర్‌దే
దిశ, తెలంగాణ బ్యూరో: బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రోత్సహిస్తోన్న ఘనత సీఎం కేసీఆర్‌దే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గౌడ వృత్తిదారులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తోందని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి సందర్భంగా చిక్కడపల్లిలో తెలంగాణ రాష్ట్ర కల్లు గీత సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని తాటి, ఈత చెట్లపై పన్నులను రద్దు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత సంఘాల సమన్వయ సమితి చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, వర్కింగ్ వైస్ చైర్మన్ యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు రమణ గౌడ్, రాష్ట్ర ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, బాలగోని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.