తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు : హరీష్ రావు

by Shyam |
Minister Harish Rao, CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘డిసెంబర్ 9’ తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదక్షుడి నాయకత్వంలో ఉద్యమం విజయతీరాలకు చేరిన రోజు అని గురువారం ట్విట్టర్ వేదికగా మంత్రి వెల్లడించారు. నాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్వరాష్ట్ర ప్రకటన చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు అన్నారు. ‘‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో’’ అన్న ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటితో పన్నెండేళ్లు అని పేర్కొన్నారు.

Advertisement

Next Story