కొత్తపల్లి ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి

by Shyam |
KCR111
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పోయింటి గోడకూలిన సంఘటనలో ఐదుగురు మరణించడం, మరో ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాల పాలు కావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేసియా చెల్లించడంతో పాటు, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి మంత్రి నిరంజన్ రెడ్డి కి సూచించారు.

మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆయా శాఖల అధికారులు హుటాహుటిన కొత్తపల్లి గ్రామానికి చేరుకున్నారు. మృతులకు అదే గ్రామంలో పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story