9గంటలు ఎంత వాడినా ఉచితమే !

దిశ, ఏపీ బ్యూరో: వ్యవసాయానికి అందించే 9గంటల విద్యుత్​ ఎంత వాడుకున్నా ఉచితమేనని సీఎం ముఖ్య సలహాదారు అజయ్​కల్లం అన్నారు. బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం ముఖ్యఉద్దేశం పగటిపూట 9గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడమేనన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును రైతుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ప్రభుత్వమే నగదు చెల్లిస్తుందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్‌ని అందిస్తున్న నేపథ్యంలో రైతుకు ప్రశ్నించే అవకాశం ఉంటుందన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత చౌకగా ఉచిత విద్యుత్‌ని అందిస్తామని వెల్లడించారు. ఈ పథకం కార్పొరేట్ పరిధిలోకి రాదని, రూ.1,250 అదనంగా చెల్లిస్తే సరిపోతుందని, శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా డిసెంబర్ నుంచి ఈ పథకం ప్రారంభం కానుందని తెలిపారు.

Advertisement