- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతిగా చికెన్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే
దిశ, వెబ్‌డెస్క్: చికెన్ ప్రియులు చాలా మంది ఉంటారు. వారికి చికెన్ చూస్తే చాలు తినేయ్యాలనిపిస్తుంది. అందుకోసమే వారు ఎప్పుడు చికెన్ తినాలనిపిస్తే అప్పుడు ఆర్డర్ పెట్టుకొని తింటుంటారు. అయితే ఇలా ఎక్కువగా చికెన్ తినడం వలన ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. అన్నే అనర్ధాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అలానే చికెన్ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఉండరు. కాని చికెన్ ఫ్రై అనేది మన ఇంట్లో చేసుకొని తినడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.
కానీ మనం బయట చికెన్ ఫ్రై తిన్నామంటే ఇక అంతే సంగతులు.. చికెన్ ఫ్రై ఈ-కోలి అనే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. దీని వలన మనం చికెన్ తిన్న తర్వాత డయేరియ లాంటి సమస్య వెంటాడుతుంది. నిల్వ ఉన్న చికెన్ తినడం వలన ఇలాంటి సమస్య తలెత్తుతుంది. ఇది ఎంత చెడ్డది అంటే ఎంతో ఇష్టంగా చికెన్ తిన్న తర్వాత కడుపులో గడబిడ మొదలవుతుంది. ఇక పరుగులు పెట్టాల్సిందే. ఎందుకిలా జరిగింది అని ఆలోచిస్తే… డాక్టర్లు ఈ-కోలి బ్యాక్టీరియా చికెన్‌పై ఉంటుందని తేల్చేస్తారు. అన్ని చికెన్లపైనా ఈ బ్యాక్టీరియా ఉంటుందా అంటే ఉండదు నిల్వ ఉన్న చికెన్లపైనే ఉంటుంది. ఈ డయేరియా ఒక్కోసారి నిమోనియా, ఊపిరి ఆడని సమస్యలకు కూడా దారితీస్తుంది.
అయితే చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే..చికెన్ తినడం వలన ప్రోటీన్స్ పెరిగి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కానీ చికెన్ అతిగా తింటే మాత్రం సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అంటున్నారు నిపుణులు. నాటు కోడి మన ఇంటిలో వండి వారానికి రెండు సార్లు తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ ఎక్కువగా బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని చికెన్ తినడం వలన డయేరియా , క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అందువలన అతిగా తినకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి.