'నాగేశ్వరరావు' … నాగచైతన్య మూవీ

by Shyam |
నాగేశ్వరరావు … నాగచైతన్య మూవీ
X

అక్కినేని నాగచైతన్య… సెలెక్టెడ్ మూవీస్‌తో కామ్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. భార్య సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న చైతన్య…. సాయిపల్లవితో ‘లవ్ స్టోరీ’తో రాబోతున్నాడు. ఈ సినిమాలో చై, సాయిపల్లవిలు డ్యాన్సర్స్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఓ డ్యాన్స్ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఇద్దరు ప్రేమలో పడిపోతారని సమాచారం. ఆ తర్వాత ఎందుకు విడిపోయారు? మళ్లీ ఎలా కలిశారు? అనేదే కథ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించే ఈ మూవీలో చైతన్య తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనున్నాడట.

ఇదిలా ఉంటే మరో సినిమాకు ఓకే చెప్పాడట అక్కినేని వారసుడు. సినిమాకు తాత పేరు ‘నాగేశ్వరరావు’ పెట్టినట్లు సమాచారం. 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ మధ్యే ‘నాగేశ్వరరావు’ టైటిల్‌ను రిజిస్టర్ చేశారట.

Advertisement

Next Story