- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మ
by Shyam |
X
ముంబయి: టీమ్ ఇండియా మాజీ పేసర్ చేతన్ శర్మ ‘సీనియర్ మెన్స్ నేషనల్ సెలక్షన్ ప్యానెల్’ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యులుండే ఈ బృందంలో అబే కురువిల్లా, దేవాశిష్ మొహంతిలను కూడా చేర్చింది. ఈ ప్యానెల్‌లో భారత జట్టు మాజీ ఆటగాళ్లు సునీల్ జోషి, హర్విందర్ సింగ్ కూడా ఉన్నారు. కాగా, చేతన్ శర్మ తన 11 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో భారత్ తరఫున 23 టెస్టులు, 65 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. 1987 ప్రపంచకప్‌లో అతని హ్యాట్రిక్ టోర్నీలోనే హైలెట్‌గా నిలిచింది. 16 ఏళ్ల వయసులోనే హర్యానా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన చేతన్, 18 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అంతకుముందు ఏడాదిలోనే (డిసెంబరు 1983) వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.
Advertisement
Next Story