రేపు సాయంత్రం బాలు అంత్యక్రియలు

by Anukaran |   ( Updated:2020-09-25 05:24:58.0  )
రేపు సాయంత్రం బాలు అంత్యక్రియలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, శుక్రవారం ఒంటిగంటలకు మరణించారు. క‌రోనాతో దాదాపు 50 రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందతూ ప్రాణాలతో పోరాడాడు. ఆయ‌న మృతితో సినీ ప‌రిశ్ర‌మ శోక‌సంద్రంలో మునిగింది. చెన్నై తిరువ‌ళ్లూరు జిల్లాలో రెడ్ హిల్స్ స‌మీపంలో ఉన్న తామ‌రైపాకంలో బాలు అంత్య‌క్రియ‌లు శనివారం సాయంత్రం జ‌రగ‌నున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గం.ల‌కు ఎంజీఎం ఆసుప‌త్రి నుంచి కోడంబాకంలోని ఎస్పీ చ‌ర‌ణ్ ఇంటికి పార్ధీవ దేహాన్ని త‌ర‌లించ‌నున్నారు. అభిమానుల సంద‌ర్శ‌నార్దం త‌ర్వాత‌ బాలు అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement

Next Story

Most Viewed