చివరి నిమిషంలో ట్విస్ట్.. కేకేఆర్‌కు షాకిచ్చిన ఆఖరి బంతి

by Anukaran |   ( Updated:2021-09-26 08:42:10.0  )
చివరి నిమిషంలో ట్విస్ట్.. కేకేఆర్‌కు షాకిచ్చిన ఆఖరి బంతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 38వ మ్యాచ్‌ ఉత్కంఠ పోరులో కేకేఆర్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ యావరేజ్ స్కోర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది కోల్‌కతా. ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోని సేన ఆదిలో అదరగొట్టినా.. మిడిలార్డర్‌ బ్యాటింగ్ అభిమానులను టెన్షన్ పెట్టింది.

ఇదే సమయంలో కోల్‌కతా బౌలర్లు జట్టు విజయం కోసం పరితపించగా.. చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి బంతికి ఒక పరుగును ఛేదించడంలో సీఎస్కే సక్సెస్ కావడంతో కోల్‌కతా పరాజయం పొందింది. రెండు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. రుతు రాజ్ గైక్వాడ్ (40) ఫాఫ్ డు ప్లెసిస్ (43), మొయిన్ అలీ (32) పరుగులతో రాణించగా.. చివర్లో జడేజా (22) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కోల్‌కతాలో సునీల్ నరైన్ 3 వికెట్లు తీసుకున్నాడు.

Advertisement

Next Story