- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘కుర్రా’డొక్కడే కొట్టాడు.. చెన్నై స్కోరు 114-9
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 41వ మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్‌లో మరోసారి చేతులెత్తేసింది. వచ్చిన ఆటగాడు వచ్చినట్టే మైదానం వీడి పెవిలియన్ బాట పట్టాడు. 7వ స్థానంలో వచ్చిన ఒక్క శామ్ కుర్రాన్ 52 పరుగులతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కానీ, మిగతా ఏ ఆటగాళ్లు కనీసం 20 పరుగులను మించి చేయలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో CSK 9 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులకే పరిమితం అయింది. ముఖ్యంగా ముంబై బౌలర్ ట్రెంట్ బోల్ట్ నాలుగు ఓవర్లు వేసి 4 కీలక వికెట్లు తీసుకున్నాడు. దీంతో చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడి అతి స్వల్ప స్కోరు(114-9)ను నమోదు చేసింది.
చెన్నై ఇన్నింగ్స్:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన CSK అభిమానులకు షాక్ ఇచ్చింది. వచ్చిన ఆటగాడు కనీసం బంతిని కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేయలేనతంగా ప్రదర్శన కనబరిచారు. ముంబై బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయారు. తొలుత ఓపెనింగ్ వచ్చిన యువఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(0) డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు డాట్ చేసి బ్యాట్స్‌మెన్ మీద ఒత్తిడి తెచ్చిన బోల్ట్ 5వ బంతికి lbwతో వికెట్ తీసుకున్నాడు. దీంతో ఒక్క పరుగు చేయకుండానే CSK తొలి వికెట్ కోల్పోయింది.
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన అంబటి రాయుడు కూడా కేవలం 2 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. రెండో ఓవర్‌లో నాలుగో బంతికి డీకాక్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఎన్.జగదీశన్‌ను (0) కూడా బుమ్రా ఐదో బంతికే డకౌట్ చేశాడు. ఇక మూడో ఓవర్ మళ్లీ బోల్ట్ వేశాడు. ఇదే ఓవర్‌లో ఒక పరుగు చేసి క్రీజులో ఉన్న డు ప్లెసిస్‌ను బోల్ట్ క్లీన్ బోల్డ్ చేశాడు. దీంతో కేవలం 3 పరుగులకే చెన్నై 4 వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ ఎంస్ ధోని 5, 6వ స్థానంలో రవీంద్ర జడేజా వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న స్కోరును ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఈ సీనియర్ ఆటగాళ్లు సైతం చేతులెత్తేశారు. తొలి పవర్ ప్లేలో మూడో ఓవర్ వేసిన ట్రెంట్ బోల్ట్.. రవీంద్ర జడేజాను(7) క్యాచ్ అవుట్ చేశాడు. ఇక ఇదే నిరుత్సాహంలో ధోని(16) 7వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. రాహుల్ చాహర్ వేసిన బంతిని ఎదుర్కొబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ వికెట్‌తో CSK జట్టులోని కీలక బ్యాట్స్‌మెన్లు కేవలం 30 పరుగులకే 6 వికెట్లను కోల్పోయారు.
ఇక 7వ స్థానంలో వచ్చిన శామ్ కుర్రాన్(52)స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో క్రీజులో ఉన్న దీపక్ చాహర్ (0) 43 స్కోరు బోర్డు వద్ద రాహుల్ చాహర్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక 9 స్థానంలో వచ్చిన శార్దూల్ ఠాకూర్ కూడా 11 పరుగులు చేసి కల్టర్ నైట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. చివరి స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన తాహీర్ 13 పరుగులు చేశాడు. ఇక చివరి ఓవర్‌లో చివరి బంతిని షాట్ ఆడబోయిన కుర్రాన్ (52) క్లీన్ బోల్డ్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 114 పరుగులకే పరిమితమైంది.
శామ్ కుర్రాన్ ఒక్కడే నిలబడ్డాడు:
7వ స్థానంలో వచ్చిన యువ ఆటగాడు శామ్ కుర్రాన్ చెన్నై జట్టులో ఒక్కడే రాణించాడు. బ్యాటింగ్ దిగినప్పటి నుంచి బాల్ టు బాల్ ఆడుతూ.. స్కోరు బోర్డును తన వంతుగా ముందుకుతీసుకెళ్లాడు. సమయం చూసి బౌండరీలు కూడా కొట్టాడు. మొత్తం 47 బంతులను ఎదుర్కొన్న కుర్రాన్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ, చివరి ఓవర్ చివరి బంతికి క్లీన్ బోల్డ్ అయ్యాడు. దీంతో 30 వద్ద ఆగిన స్కోరు బోర్డు ఎట్టకేలకు 114 కు చేరుకుంది.
స్కోరు బోర్డు: 114-9
Chennai Super Kings Innings: 114-9 (20 Ov)
1. రుతురాజ్ గైక్వాడ్ lbw b బోల్ట్ 0(5)
2. ఫాఫ్ డూ ప్లెసిస్ c డీకాక్ b బోల్ట్ 1(7)
3. అంబటి రాయుడు c డీ కాక్ b బుమ్రా 2(3)
4. ఎన్.జగదీశన్ c సూర్యకుమార్ యాదవ్ b బుమ్రా 0(1)
5. ఎంఎస్ ధోని (c) (wk)c డీ కాక్ b రాహుల్ చాహర్ 16(16)
6. రవీంద్ర జడేజా c కృనాల్ పాండ్యా b బోల్ట్ 7(6)
7. శామ్ కుర్రాన్ b బోల్ట్ 52(47)
8. దీపక్ చాహర్ st డీకాక్ b రాహుల్ చాహర్ 0(5)
9. శార్దుల్ ఠాకూర్ c సూర్యకుమార్ యాదవ్ b కల్టర్ నైల్ 11(20)
10. ఇమ్రాన్ తాహీర్ నాటౌట్ 13(10)
ఎక్స్‌ట్రాలు: 12
మొత్తం స్కోరు: 114-9
వికెట్ల పతనం: 0-1 (రుతురాజ్ గైక్వాడ్, 0.5), 3-2 (అంబటి రాయుడు, 1.4), 3-3 (ఎన్ జగదీశన్, 1.5), 3-4 (ఫాఫ్ డు ప్లెసిస్, 2.5), 21-5 (రవీంద్ర జడేజా, 5.2),
30-6 (ఎంస్ ధోని, 6.4), 43-7 (దీపక్ చాహర్, 8.5), 71-8 (శార్దుల్ ఠాకూర్, 14.5), 114-9 (శామ్ కుర్రాన్, 19.6)
బౌలింగ్:
1. ట్రెంట్ బోల్ట్ 4-1-18-4
2. జస్ప్రీత్ బుమ్రా 4-0-25-2
3. కృనాల్ పాండ్యా 3-0-16-0
4. రాహుల్ చాహర్ 4-0-22-2
5. నాథన్ కల్టర్ నైల్ 4-0-25-1
6. కీరన్ పొలార్డ్ 1-0-4-0