- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెలరేగిన జడేజా.. చేతులెత్తేసిన KKR
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న (IPL)-49 మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన KKR జట్టు CSK ముందు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగిన చెన్నై ఆటగాళ్లు ఆది నుంచే దూకుడు కనబరిచారు. ఓపెనర్ రుతిరాజ్ గైక్వాడ్ 72(52) , అంబటి రాయుడు 38(20), జడేజా 31(11) చెలరేగి ఆడటంతో KKR బౌలర్ల పాచికలు పారలేదు. మ్యాచ్ చివల్లో జడేజా సిక్సుల వర్షం కురిపించడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి సులువుగా విజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చైన్నై సూపర్ కింగ్స్ జట్టు మ్యాచ్ ఆరంభం నుంచి తక్కువ వ్యవధిలో ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఓపెనర్లు షేన్ వాట్సాన్, రుతిరాజ్ గైక్వాడ్ నెమ్మదిగా స్ట్రైక్ రోటెట్ చేస్తూ వచ్చారు. క్రీజులో కుదురుకున్న ఇద్దరూ ఆ తర్వాత బాదడం ప్రారంభించారు. రుతిరాజ్ మెరుపు వేగంతో పరుగులు రాబడుతుండగా అతనికి వాట్సాన్ తోడయ్యాడు. సిక్సులు, ఫోర్లతో బంతిని బౌండరీలకు బాదారు. చక్రవర్తి వేసిన ఏడో ఓవర్లో భారీషాట్‌కు యత్నించి వాట్సాన్ రింకు సింగ్‌కు దొరికిపోయాడు. దీంతో తొలివికెట్ నష్టానికి CSK జట్టు 50-1(7.3) చేసింది.
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాయుడు తొలుత నెమ్మదిగా ఆడినా నితిష్ రాణా వేసిన తొమ్మిదో ఓవర్లో తన విశ్వరూపం చూపించాడు. హ్యాట్రిక్ ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యే సమయానికి చెన్నై 74-1పరుగులు రాబట్టింది. ఆ తర్వాత రుతిరాజ్‌కు రాయుడు తోడవడంతో వీరిద్దిరూ బౌండరీల వర్షం కురిపించారు. భారీ షాట్స్ ఆడుతూ త్వరగా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే KKR బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. దీంతో రెండో స్టాటజిక్ సమయానికి ‘రుతిరాజ్’ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా .. CSK జట్టు 109-1(13)పరుగులు చేసింది.
అనంతరం అంబటి రాయడు 38(20) కమిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా, ఆ వెంటనే ధోని1(4) కూడా చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఒకానొక సమయంలో KKR బౌలర్లు CSK ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచింది. ఆ తర్వాత సామకర్‌న్‌తో కలిసి రుతిరాజ్ మళ్లీ CSKను గాడిన పెట్టాడు. కమిన్స్ బౌలింగ్‌లో రుతిరాజ్ వెనుదిరగడంతో.. ఆరో స్థానంలో జడేజా ఎంట్రీ ఇచ్చాడు. రావడంతోనే దూకుడుగా ఆడిన జడ్డు.. మ్యాచ్ ఎండింగ్‌లో 31(11) సిక్సుల వర్షం కురిపించాడు. దీంతో కోల్‌కత్తా నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని CSK జట్టు 6 వికెట్ల తేడాతో ఛేదించింది.
Kolkotha Knight riders innings :
షేన్ వాట్సన్ 14(19) c రింకుసింగ్ b చక్రవర్తి, అంబటి రాయుడు 38(20) c సునీల్ నరైన్ b కమిన్స్, ధోని 1(4) బౌల్డ్ b చక్రవర్తి, గైక్వాడ్ 72(52) బౌల్డ్ b కమిన్స్, జడేజా 31(11) నాటౌట్, సామ్ కరన్ 13(14)
ఎక్స్‌ట్రాలు: 9
మొత్తం స్కోరు: 178/4 (20)
వికెట్ల పతనం: 50-1 (షేన్ వాట్సాన్- 7.3,) 118-2 (అంబటి రాయుడు- 13.4) 121-3 (ధోని, 14.4)
బౌలర్లు: పాట్ కమిన్స్ 4-0-31-2, కమలేష్ నాగర్ కోటి 3-0-34-0, సునీల్ నరైన్ 4-0-23-0, ఫెర్గ్యూసన్ 4-0-54-0, వరుణ్ చక్రవర్తి 4-0-20-2, నితీష్ రాణా 1-0-16-0
Chennai super kings Innings:
శుభ్‌మన్ గిల్ బౌల్డ్ b కరన్ శర్మ 26(17), సునీల్ నరైన్ 7(7) రవీంద్ర జడేజా b సాంట్‌నర్, రింకు సింగ్ 11(11) c అంబటి రాయుడు b రవీంద్ర జడేజా, నితీష్ రాణా 87(61), c సామ్ కరన్ b ఎంగిడి, మోర్గాన్ (c) 15(12) c రుతురాజ్ గౌక్వాడ్ b ఎంగిడి, దినేష్ కార్తీక్ 21(9) నాటౌట్, రాహుల్ త్రిపాటి 1(1) నాటౌట్
ఎక్స్‌ట్రాలు: 2
మొత్తం స్కోరు: 172/5 (20)
వికెట్ల పతనం: 53-1 (శుభమన్ గిల్- 7.2,) 60-2 (సునీల్ నరైన్- 8.3)
93-3 ( రింకు సింగ్- 12.5), 137-4 (నితీష్ రాణ-17.1), 167-5 ( మోర్గాన్, 19.2)
బౌలర్లు: దీపక్ చాహర్ 3-0-31-0, సామ్ కరన్ 3-0-21-0, లుంగీ ఎంగిడి 4-0-34-2, మిచెల్ సాంట్ నర్ 3-0-30-1, రవీంద్రజడేజా 3-0-20-1, కరణ్ శర్మ 4-0-35-1