- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ నటుడు విశ్వంత్‌పై చీటింగ్ కేసు
దిశ, క్రైమ్ బ్యూరో : బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో సినీ నటుడు విశ్వంత్ పై కేసు నమోదయ్యింది. సెకండ్ హ్యాండ్ కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసం చేసినట్టుగా విశ్వంత్‌పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు రామకృష్ణ సినీ నటుడు విశ్వంత్ ద్వారా ఆకాష్ గౌడ్ అనే వ్యక్తికి రూ.1.7.5 లక్షలను కారు కొనుగోలు నిమిత్తం చెల్లించాడు.
అయితే, ఆ కారు ఆకాష్ గౌడ్ పేరుపై ఉండటమే కాకుండా, ఫైనాన్స్ ఉన్న విషయాన్ని చెప్పలేదు. అకస్మాత్తుగా ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఈ కారుపై ఫైనాన్స్ బకాయి ఉన్నట్టు చెప్పడంతో రామకృష్ణ కంగుతిన్నాడు. దీంతో తనను మోసం చేసిన ఆకాష్ గౌడ్ తో పాటు
విశ్వంత్ పై కూడా బాధితుడు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ కళింగరావు తెలిపారు. సినీ నటుడు విశ్వంత్ కేరింత, ఓ పిట్టకథ సినిమాలలో నటించారు.