- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.3 వేల కోట్లు దుబారా కాదా?: బాబు
పంచాయతీ కార్యాలయాలకు రంగులు వెయ్యడానికి హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ రంగులు తియ్యడానికి సుమారు 3 వేల కోట్ల రూపాయల ఖర్చని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల ప్రకారం వైఎస్సార్సీపీ వేసిన పార్టీ రంగులు తొలగించకపోతే తామే రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. కనీసం బాత్‌రూమ్‌లను కూడా వదిలిపెట్టకుండా రంగులేశారని ఆయన విమర్శించారు. జాతీయ జెండాకు కూడా ఆ పార్టీ రంగులేసిందని ఆయన మండిపడ్డారు. రంగులు వేయడానికి, వేసిన రంగులు తియ్యడానికి సుమారు 3 వేల కోట్ల రూపాయలు ఖర్చని, అది దుబారా వ్యయం కాదా? అని ఆయన నిలదీశారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా విగ్రహాలకు ముసుగులు వెయ్యలేదన్న ఆయన, దీనిపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ధృవపత్రాలు, నోడ్యూస్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా టీడీపీ అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. వీఆర్వో, పంచాయతీ అధికారులు అందుబాటులో లేరని విమర్శించారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని, ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్లు తీసుకున్నా సంతకాలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులెవరైనా నామినేషన్ వేయ్యలేకపోతే ఆ బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనన్న ఆయన, అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు నిర్వహించలేకపోతే వాయిదా వేయాలని ఆయన సూచించారు.