- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు విమర్శలు రాజకీయ లబ్ధి కోసమే:పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: ఒక్క సెంటు పంట నష్టపోయినా ప్రభుత్వం ఆదుకుంటుందని, ఏ ఒక్క రైతుకు ఈ ప్రభుత్వం అన్యాయం జరగనివ్వదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన భారీ వర్షాలు, వరదల వల్ల చిత్తూరు జిల్లాలో రోడ్లు, పంటలు 70 నుంచి 80 శాతం మేర నష్టం వాటిల్లిందనిని చెప్పుకొచ్చారు. వరద నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఇది ప్రకృతి విపత్తు. ఊహించని వరదలు రావడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు తెగిందని స్పష్టం చేశారు. ఇందులో ఎవరి తప్పులేదన్న ఆయన చంద్రబాబుకు రాజకీయ ఆలోచన తప్ప మరొకటి లేదని విమర్శించారు. అధికారంలోకి రావాలన్న ధ్యాసతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వరద బాధితులకు పరిహారం ఇస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.