నాకు మాటలు రావడం లేదు: చంద్రబాబు

by srinivas |
నాకు మాటలు రావడం లేదు: చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రుల పని తీరుపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే దారుణ పరిస్థితులు వెలుగుచూస్తున్నాయని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒంగోల్ జీజీహెచ్ హాస్పిటల్‌లో మరో దారుణం వెలుగుచూసింది. రెండ్రోజులగా ఓ రోగి శవం నేల మీదనే పడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ వీడియోను తన ట్విట్టర్‌ల్ షేర్ చేస్తూ.. ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఓ రోగి శవం రెండ్రోజులుగా పడి ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఇది హృదయ విదారకం అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ శవాన్ని కుక్కలు పీక్కు తినేలా ఉన్నాయని.. మానవత విలువలకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన ఆయన.. తనకు మాటలు కూడా రావడం లేదంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story