ఐటీ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి !

by srinivas |
ఐటీ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి !
X

దిశ, ఏపీ బ్యూరో: నాడు ఐటీ కంపెనీల కోసం ప్రపంచమంతా తిరిగి రప్పించా. ఆ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ముంబై ఐఐటీ విద్యార్థులతో చంద్రబాబు ఆన్‌లైన్‌లో ముఖాముఖి నిర్వహించారు. అంతర్జాతీయ బిజినెస్ ఫెస్టివల్లో భాగంగా ప్రసంగించిన చంద్రబాబు.. సైబరాబాద్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు 4శాతం జీడీపీ హైదరాబాద్‌ నుంచే వస్తోందన్నారు. ఎంతో ముందుచూపుతో విజన్-2020 రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రెండంకెల వృద్ధిరేటు సాధించామన్నారు. వ్యవసాయంలోనూ 17 శాతం వృద్ధి రేటు సాధించినట్లు గుర్తు చేశారు.

Advertisement

Next Story