- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రబాబు రసం పీల్చే పురుగు.. మంత్రి కన్నబాబు ఫైర్
దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రసం పీల్చే పురుగు అంటూ మంత్రి కురసాల కన్నబాబు సంచలన ఆరోపణలు చేశారు. 2019లో లేవలేని స్థాయిలో ప్రజలు పురుగు మందు కొట్టారు. అయినప్పటికీ రసం పీల్చడం మానలేదని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు తామర పురుగుతో నష్టపోయారు. చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు అంటూ చమత్కరించారు.
2019 రాజధాని కోసం భూములా, భూముల కోసం రాజధానియా అన్న అంశంపై రాష్ట్రంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గత కొంతకాలంగా చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అనుమానం వస్తుందన్నారు. చంద్రబాబు స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నారా అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనం అనుకున్నారా అంటూ ప్రశ్నించారు. అమరావతిలో సొంత మనుషుల చేత భూములు కొనిపించి అమరావతి రాజధానిగా ప్రకటించారని దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
తోటలు తగులబెట్టి మరీ భూములు లాక్కున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకోవాలని సీఎం జగన్ పాలన చేస్తుంటే.. భూముల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులతో రాజకీయం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారంటూ మండిపడ్డారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రు వాస్తవాలు మాట్లాడితే తప్పుపడుతున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు… తప్పెటగుళ్ళు బ్యాచ్ పులివెందులలో గెలుస్తాం అంటున్నారని… ముందు కుప్పంలో ఎలా గెలవాలో చూసుకోవాలంటూ హితవు పలికారు. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు ఎవరు స్పాన్సర్డ్ అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునంటూ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు.